Back to Top
  • WE CREATE THE WEB

    Nullam dignissim convallis est.Quisque aliquam. Donec faucibus. Nunc iaculis suscipit dui.Nam sit amet sem. Aliquam libero nisi, imperdiet at, tincidunt nec, gravida vehicula, nisl.Praesent mattis, massa quis luctus fermentum, turpis mi volutpat justo, eu volutpat enim diam eget metus.Maecenas ornare tortor.

    ABOUT WEB CANONS

  • WE LOVE WHAT WE DO

  • THINKERS & DESIGNERS

MS Excel: ఎంఎస్‌ ఎక్సెల్‌కి న్యూ ఫీచర్స్‌ యాడ్‌ చేసిన మైక్రోసాఫ్ట్‌.. అప్‌డేట్స్‌ బెనిఫిట్స్‌ ఇవే..

 ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్( Microsoft ) అందించే మేజర్‌ సర్వీసెస్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ అందిస్తున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌లు తరచూ ఉపయోగిస్తుంటారు. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ఆయా సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి అప్‌డేట్‌లను అందిస్తుంటుంది. ఇప్పుడు ఎంఎస్‌ ఆఫీస్‌(MS OFFICE)లో కాంపోనెంట్ అయిన ఎంఎస్‌ ఎక్సెల్‌(MS EXCEL)కి మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్స్‌ని అనౌన్స్ చేసింది. ఎంఎస్‌ ఎక్సెల్‌ ఒక స్ప్రెడ్ షీట్.. విండోస్‌, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, మ్యాక్‌ ఓఎస్‌లపై పని చేస్తుంది. క్యాలిక్యులేషన్స్, గ్రాఫిక్ టూల్స్, పివోట్‌ టేబుల్, మైక్రో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వంటి బేసిక్‌ ఫీచర్స్‌ని అందిస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని అదనపు ఫీచర్స్‌ని యాడ్‌ చేసినట్లు మంగళవారం మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ WEB, MAC, WINDOWS వెర్షన్స్‌కు లభిస్తుంది. వీటిలో WEBకి అత్యధిక అప్‌డేట్స్‌ను కంపెనీ రిలీజ్‌ చేసింది.

* ఎక్సెల్‌ కొత్త ఫీచర్స్‌ కొత్త అప్‌డేట్‌లో భాగంగా ఎక్సెల్ షీట్‌లో టెక్స్ట్ కి బదులుగా సెల్స్‌లో ఫోటోలు వాడుకునే వెసులుబాటును మైక్రోసాఫ్ట్‌ కల్పించింది. యూజర్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొత్త ఫీచర్స్‌ రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది. ఫార్ములా బై ఎగ్జాంపుల్(Formula by Example), ఫార్ములా సజెషన్స్(Formula Suggestions), సజెస్టడ్ లింక్స్(Suggested Links), యాడ్‌ సెర్చ్ బార్ ఇన్ క్వెరీస్‌ పేన్(Add Search Bar In Queries Pane) వంటి ఇతర ఫంక్షన్లు కూడా అందించింది. ఎక్సెల్‌లో ఇమేజ్ టూల్‌కి సంబంధించిన అప్‌డేట్ ఆగస్ట్‌లోనే బయటకు వచ్చింది. కొత్త ఫీచర్‌ని ఉపయోగించుకుని ఒక యూజర్‌ కంప్యూటర్‌ లోకేషన్‌ను సెలక్ట్‌ చేసుకుని సెల్స్‌లోకి ఇమేజెస్ యాడ్‌ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ టూల్స్‌లో ఉన్న ఇతర ఫంక్షన్స్ ఉపయోగించి ఇమేజెస్ ఫిల్టరింగ్, సోర్టింగ్, మూవింగ్ అండ్ రీసైజింగ్ చేయవచ్చు. * ఆటోమేటిక్‌ సజెషన్స్‌ అందించే ఆప్షన్లు ఇతర ఫీచర్ అయిన ఫార్ములా బై ఎగ్జాంపుల్ అనేది ప్యాట్రన్‌ ఇంటెలిజెన్స్‌ ఐడెంటిఫై చేస్తుంది. ఒక యూజర్ తన దగ్గర ఉన్న రిపీటివ్ డేటాతో మాన్యువల్‌గా ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేసినప్పుడు యూజర్ స్టాటిక్ టెక్ట్స్‌ను రీప్లేస్ చేయడానికి ఫ్లాష్ ఫిల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఫార్ములా సజెషన్ అనే ఫీచర్ ద్వారా ఫార్ములా బార్‌లో లేదా సెల్‌లో ఈక్వల్ టూ(=) సైన్ టైప్ చేసినప్పుడు సమ్, యావరేజ్, మ్యాక్స్, కౌంట్‌ వంటి ఆప్షన్‌లు కనిపిస్తాయి. ఇది స్ప్రెడ్ షీట్‌లో ముందే ఉన్న డేటా ఆధారంగా జరుగుతుంది. సజెస్టడ్‌ లింక్స్ ఫీఛర్ ద్వారా క్లౌడ్ బుక్స్‌లో ఉన్న బ్రోకెన్ ఎక్స్‌టెర్నల్‌ లింక్స్‌ను సరిచేయడానికి సహకరిస్తుంది. బ్రోకెన్ లింక్స్‌ని ఫిక్స్‌ చేయడానికి డైరెక్ట్‌గా కొత్త లొకేషన్స్‌ సజెస్ట్ చేయడం అలాగే డేటా స్టోర్ చేయడానికి న్యూ క్లౌడ్ బుక్స్‌కి అనుమతి ఇవ్వడం చేస్తుంది.

యాడ్ సెర్చ్ బార్ ఇన్ క్వెరీస్‌ పేన్ ఫీచర్ ద్వారా ఎక్సెల్‌లో ఉన్న న్యూ సెర్చ్ బార్ ఆప్షన్‌తో ఫైల్స్‌ సెర్చ్ చేయడానికి సరైన మార్గాన్ని చూపిస్తుంది.ఈ ఫీచర్స్‌ని మైక్రోసాఫ్ట్ తాజాగా బయటకు విడుదల చేసింది. వీటికి మరికొన్ని ఆప్షన్‌లను త్వరలోనే యాడ్‌ చేయనున్నట్లు ప్రకటించింది.